Nov 03,2022 23:35

మాట్లాడుతున్న నా బార్డు ప్రతినిధి

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఉద్దండపురం గ్రామంలో గురువారం వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తిదారులు సమావేశం సంస్థ సీఈవో గింజాల అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలకు పూతరేకుల తయారీపై నాబార్డ్‌, ఎస్‌వీడీఎస్‌ పర్యవేక్షణలో శిక్షణ ఉంటుందని, దీనిని సద్వినియోగపర్చుకోవాలని నాబార్డు ప్రతినిధి శ్రీనివాస్‌, ఎస్పీడీసీ సంస్థ సెక్రటరీ కె. జోగినాయుడు సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తుల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని ఉద్దండపురం సర్పంచ్‌ పొడగట్ల వెంకటేశ్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బచ్చల రాజు, ఉద్యానవనశాఖాధికారిణి ఉమామహేశ్వరి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.