కడపప్రతినిధి : జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ఆదరణ పెరుగుతోంది. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 17 రకాల పండ్లతోటలు సహా కూర గాయలు, పువ్వుల సాగును కలిపితే 25 రకాల వాణిజ్య పంటలు సాగులో ఉన్నాయి. ఉద్యాన పంటల సాగుకు మెరుగైన ప్రోత్సాహకాలతో ముందుకు సాగు తున్నాం. జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామనే సాగుతున్న ప్రచారాన్ని సాకారం చేసుకునే దిశగా కదులుతున్నాం. అరటి, మామిడి, చీనీ దిగుబడుల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నాం. వీటికి అదనంగా ఆయిల్‌ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాం. ఉద్యాన, వాణిజ్య పంటల దిగుబడులకు మంచి ధరలు లభించడం, వాటిని విదేశాలకు ఎగుమతులు చేయ డం ద్వారా విదేశీమా రకద్రవ్యాన్ని సమ కూర్చడంపై దృష్టి సారించామని పేర్కొంటున్న హార్టీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఐజె మైఖేల్‌రాజీవ్‌తో ముఖాముఖి...
ఉద్యాన సాగు వివరాలు తెలపండి?
జిల్లాలో 1.60.733 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. దేశీయంగా ఉద్యాన పంటలకు పెరుగుతున్న ఆదరణ నేప థ్యంలో ఉద్యాన, వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా ఏటా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఇందులో ప్రధా నంగా అరటి, మామిడి, చీనీతోటలు, కూరగాయల తో టలు పెద్దఎత్తున సాగులో ఉన్నాయి.
ఉద్యాన స్కీమ్‌ల వివరాలు చెప్పండి?
ఎంఐడిహెచ్, ఆర్‌కెవివై స్కీములు అమల్లో ఉన్నాయి. మిషన్ ఇంటెగ్రేటెడ్ డెవలప్‌మెంట్ పథకం కింద 40 నుంచి 50 శాతం సబ్సిడీ అందజేస్తున్నాం. ఆర్‌కెవివై స్కీమ్ కింద పత్తి సెంటర్లలో 35 శాతం సబ్సిడీ, ఆరెంజ్, కూరగాయల సాగుకు 50 శాతం సబ్సిడీ అందజేస్తు న్నాం.
పండ్లతోటల వివరాలు తెలపండి?
జిల్లాలో 17 రకాల పండ్లతోటలు సాగవుతున్నాయి. పండ్ల తోట లతోపాటు ఎనిమిది రకాల కూరగాయలు, పువ్వుల తోటలు సాగవుతున్నాయి. ఇందులో 10,112 ఎకరాల్లో మామిడి, 20, 431 ఎకరాల్లో అరటి, 65,379 ఎకరాల్లో చీనీ, 2011 ఎకరాల్లో సపోటా, 835 ఎక రాల్లో బొప్పాయి సాగవుతోంది. వీటితోపాటు జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, ఉల్లి, టమోటా, చామంతి తదితర పూలతోటలు సాగులో ఉన్నా యి.
హార్టీహబ్ ప్రచారంలో వాస్తవికత ఎంత?
హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామనే ప్రచారంలో వాస్తవికత ఉంది. రాష్ట్రంలోనే జిల్లాలో పండ్లతోటలు పెద్దఎత్తున సాగులో ఉన్నాయి. జిల్లా లోని పులివెందుల ప్రాంతం నుంచి అరటి ఉత్పత్తులు మధ్యాసియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు దేశారు కంపెనీ, ఐఎన్‌ఐ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల ఆధ్వర్యంలో ఎగుమతులు జరుగు తున్నాయి. ఇదేతరహాలో వీరబల్లి బేనీషా రకం మామిడి దేశ, విదేశీ మార్కెట్లకు తరలిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు దోస, బొప్పాయి ఉత్పత్తులు అదేదారిలో ఉన్నాయి. వీటి సంర క్షణకు ఇప్పటికే రైపనింగ్‌ఛాంబర్స్, పుడ్‌ప్రా సెసింగ్ యూనిట్లు, పండ్ల రసాల కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.
ప్రోత్సాహకాల గురించి తెలపండి?
కొత్త ఉద్యాన పంటల సాగుకు ప్రో త్సాహకాలు అందిస్తున్నాం. సాగు దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నాం. ఉదా: డ్రాగన్‌ఫ్రూట్స్, దానిమ్మ తదితర ఇతర కొత్త రక పు పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.
సబ్సిడీల వివరాలు తెలపండి?
రైపనింగ్‌ఛాంబర్స్, శీతలీకరణ కేంద్రాల ఏర్పాటుకు సబ్సిడీలు ఇస్తున్నాం. ఎఫ్‌పి ఓలకు 75 శాతం కలెక్షన్ సెంటర్లుకు, వ్యక్తిగత కోటా కింద రైతులకు 35 శాతం చొప్పున సబ్సిడీలు అందిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో ఐదు ప్రాంతాల్లో రైపనింగ్ ఛాంబర్స్ ఏర్పాటు చేశాం. రైతులు దరఖాస్తు చేసిన వెంటనే స్పందిస్తున్నాం. దీంతోపాటు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు, పండ్ల రసాల పరిశ్రమల స్థాపనలను ప్రోత్సహిస్తున్నాం. ఫలి తంగా రైతుల దిగుబడులకు మెరుగైన ధర లభించడంతోపాటు ఆర్థిక జవ సత్వాలు ఒనగూరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అను కుంటు న్నాం.
ఫుడ్‌ప్రాసెసింగ్ ఏర్పాటుపై స్పందించండి?
ప్రధానమంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం అమల్లో భాగంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో ఫుడ్‌ప్రాసెసింగ్ పరి శ్రమ లను ఏర్పాటు చేస్తున్నాం. 35 శాతం సబ్సిడీతో యువతను ప్రోత్సహిస్తోంది. ఇందులోభాగంగా ఈనెల 4న కడప పార్లమెంట్ పరిధిలోని పులి వెందుల్లో అరటి ఆహార శుద్ధి పరిశ్రమ యూనిట్ ఏర్పాటు చేయను న్నాం.
వాణిజ్య సాగును వివరించండి?
జిల్లాలో ఆయిల్‌ఫామ్ సాగుపై దృష్టి సారించాం. ఆరు మండ లాల్లో 200 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు కసరత్తు చేశాం. ఈమేరకు సువెన్ ఆర్గో కంపెనీ సైతం సుముఖత వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో జిల్లాలోని బి.మఠం, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, పోరుమా మిళ్ల, కాశినాయన మండలాలను ఎంపిక చేశాం. రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఇ-క్రాప్ బుకింగ్ పరిస్థితి ఎలా ఉంది?
ఈనెల 23 నాటికి 95 శాతంపైగా ఇ-క్రాప్ బుకింగ్ చేశాం. సెప్టెంబర్ 30 నాటికి 100 శాతం లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటాం.










