May 08,2023 00:04

గిడిజాలలో ఉద్యాన పంటలను పరిశీలిస్తున్న పివి.రమణ

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఇటీవల కురిసిన వర్షాలకు ఉద్యాన పంటలు ఏ మేరకు దెబ్బతిన్నాయో తెలుసుకునేందుకు ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్‌ పివి.రమణ, జిల్లా ఉద్యాన అధికారి కె.మన్మధరావు, డివిజన్‌ ఉద్యాన అధికారి పి.స్వాతిలతో కలిసి ఆదివారం భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పర్యటించారు. బొప్పాయి, అరటి, మామిడి, కూరగాయలు, పూల తోటలను పరిశీలించారు. రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా పంటలు దెబ్బ తినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. క్షేత్ర స్థాయి ఉద్యాన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శాస్త్రీయ పద్దతులు పాటించాలని కోరారు.
ఆనందపురం మండలం గంభీరం, గిడిజాల, పద్మనాభం మండలం అనంతవరం, రెడ్డిపల్లి ప్రాంతాల్లో ఉద్యాన పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆర్‌బికెల సిబ్బంది పాల్గొన్నారు.