May 06,2023 00:32
గిరిజనుడిని అదుపులోకి తీసుకున్న ఫారెస్టు అధికారులు

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: మూడు ఉడుములు పట్టుకున్న వ్యక్తికి జైలు శిక్ష పడింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దదోర్నాల మండల పరిధిలోని కొర్రపోలు అటవీ శాఖ కార్యాలయ సరిహద్దులో గల పెద్దమంతనాలలో భూమని పోతన్న అనే చెంచు గిరిజనుడు మూడు ఉడుములను పట్టుకున్నాడు. రెండింటిని చంపడంతో పాటు ఒక దానిని తన వద్దనే ఉంచుకున్నాడు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ ఎఫ్‌ఆర్వో ప్రసన్నజ్యోతి ఆధ్వర్యంలో చెంచు గిరిజనుడిని అదుపులోకి తీసుకున్నారు. బతికి ఉన్న ఉడుమును నల్లమల అటవీ ప్రాంతంలో వదిలారు. చనిపోయిన రెండు ఉడుములకు ఆత్మకూరు ప్రభుత్వ పశు వైద్యాధికారి జుబేర్‌ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరచగా రిమాండ్‌కు పంపారు. అటవీ శాఖ సిబ్బంది తానీషా, భాను ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.