ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ బియ్యం రేటు వింటేనే బాబోరు... అనే పరిస్థితిలో బియ్యం ధర పెరిగి పోయింది. పదులు కాదు, వందలు కాదు ఏకంగా వేలల్లో ధరలు పెరగడంతో ప్రజలు హాహాకారాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఇవే పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగితే బియ్యం కొనలేని పేద, మధ్యతరగతి ప్రజలు పస్తులతో కాలం గడపాల్సిన దుస్థితి వచ్చినా రావచ్చు.
నెలరోజుల కిందటి వరకూ బియ్యం ధర సగటున కిలోకు రూ.10 ఇప్పుడు అది రూ.50 మార్కును దాటిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో మూడు రకాల బియ్యం అందుబాటులో ఉన్నారు. బిపిటి సన్నబియ్యం క్వింటాలుకు 100 పెరిగి రూ.4,200 నుంచి రూ.15కు చేరింది. పల్నాటి జిల్లా గుంటూరులో పండే నాణ్యమైన సన్నబియ్యం రకం రూ.వెయ్యి పెరిగి రూ.4200 నుంచి రూ.5200కు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే హెచ్‌ఎంటి స్లిమ్స్ బియ్యం ధర రూ.14 పెరిగి రూ.4,230 నుంచి రూ.5000 వరకూ వెళ్లింది. మరో రెండు, మూడు రోజుల్లో క్వింటాలుకు రూ.2 నుంచి 4 వందల వరకూ రేటు పెరుగుతుందని మిల్లర్లు చెబుతున్నారు. 25 కిలోల బస్తారు సగటున రూ.200 మంచి రూ.775 మేర భారం పడుతోంది.
కత్రిమ కొరతతో మరింత దోపిడీ
ఏరోజుకారోజు బియ్యం ధరలు పెరుగుతుండడంతో బియ్యం మాపియా, మిల్లర్లు చెలరేగిపోతున్నారు. కత్రిమ కొరతను సష్టిని ప్రజలను దోచేస్తున్నారు. డిమాండ్ కంటే తక్కువ బియ్యం సరఫరా చేయడం ద్వారా కత్రిమ కొరతను చూపిస్తున్నారు. భవిష్యత్తులో మరింత ధర పెరిగే వీలు ఉం చన్న వదంతులను వ్యాపింపజేయడం ద్వారా డిమాండ్‌ను మరింత పెంచుతున్నారు. ఇప్పటికే 25 శాతం ధరలు పెంచిన బియ్యం వ్యాపారులు, మిల్లర్లు బియ్యం సరిపడా లేవని భ్రమింపజేసేయకు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. బియ్యం హోల్‌సేలర్లు కొత్త విధానాన్ని ముందుకు తెచ్చారు. ఇతర రాష్ట్రాలకు బారీ ఎత్తున ఎగుమతులు అవుతున్నాయని, బియ్యం లభ్యత తగ్గిందని ప్రచారం చేస్తూ మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ భయాందోళనలతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు.
కాకినాడ జిల్లాకు నెల్లూరు, ఉభయ గోదావరి తెలంగాణ, బీహార్, యుపి తదితర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి జరుగుతోంది. దిగుమతుల్లో సింహభాగం ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే హెచ్‌ఎంటి బియ్యం వాటానే అధికం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు వరి పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గి బియ్యం ధరలు పెరిగాయని మిల్లర్లు చెబుతున్నారు. కానీ అధిక మొత్తంలో ఎగుమయ్యే ఉత్తరాద్ణి రాష్ట్రాల బియ్యం ధర అంతకు మించి పెరగడమే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం. రాగా తెలంగాణలో ఉన్న ఇథనాల్ పరిశ్రమలకు బియ్యాన్ని భారీగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ బియ్యం విక్రయం కంటే ఆధికాదాయం వస్తుండడంతో మిల్లర్లు కూడా ముందుగానే ధాన్యం కొను గోలు చేసి ఆటు తరలిస్తున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే రోజుల్లో బియ్యం ధర ఎంత పెరుగుతుందో ఊహించడం కూడా కష్టం కావచ్చేమో!
పట్టించుకోని ప్రభుత్వం
ధరల పెంపు వరకు దాదాపు ఆరు, ఏడు నెలల క్రితమే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రైతులు పండించిన ధాన్యానికి నిర్ణయించిన మద్దతు ధర కంటే రూ.100 నుంచి రూ.200 అదనంగా ఇచ్చి మిల్లర్లు, ధాన్యం సిండికేట్లు ముందుగానే ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా కొందరు అధికారపార్టీ చోటా నేతలు, వారి అనుయాయుల ముందుగానే ధాన్యం కొని తమ చేతుల్లో పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇథనాల్ పరిశ్రమల కారణంగా దాన్యం డిమాండ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో అధికారపార్టీ నేతలు ఆరు నెలం క్రితమే పథకం ప్రకారం ఆధిక ధరలు చెల్లించి ధాన్యం కొనుగోలు చేశారని సమాచారం. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోక పోవడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ధరలు ఇంతలా పెరిగినా ప్రజలు దోపిడీకి గురవుతున్నా బియ్యం మాఫియా, మిలర్లు బ్లాక్, మార్కెట్‌దారులపై ప్రభుత్వం కనీసపాటి చర్యలు కూడా తీసుకోలేదు. అక్రమార్కుల చెరలో ఉన్న బియ్యాన్ని ఒక్క కిలో కూడా బయటికి తీసుకురాలేదు. ఎంతో ఆర్బాటంగా ధరల స్థిరీకరణ కోసం రూ.వేల కోట్ల నిధులు కేటాయించామని చెప్పిన ప్రభుత్వం బియ్యం ధరను స్థిరీకరించడానికి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ముజూరు చేయలేదు. ధరల మోతతో ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదు. అధికారులు కవలలేదు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రైతు బజార్లో సబ్సిడీపై ప్రభుత్వం బియ్యాన్ని అమ్ముతున్నా అవి ఎప్పుడు అమ్ముతున్నారో ప్రజలకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
టాక్స్‌లు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ
మధ్యతరగతి సామాన్య కుటుంబాలను మోసం చేస్తూ బియ్యం అమ్మే యాజమాన్యాలు 25 కేజీల బస్తాలు మాని, 26, 27 కేజీలుగా బస్తాలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. అయితే అధికారుల తనిఖీల్లో మాత్రం 25 కేజీలే చూపిస్తుండడం పట్ల యాజమాన్యాలు అడ్డగోలు పరిస్థితి తేటతెల్లమైంది. ప్రస్తుత కాలంలో 25 కేజీలు బస్తాలు అమ్మకం చేపడితే ట్యాక్స్‌లు కట్టాలన్న ఉద్దేశంతో రీటైల్ వ్యాపారం నుంచి హోల్‌సేల్ వ్యాపారానికి మారేలా 26, 27 బస్తాలు మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో సామాన్య మధ్య తరగతి వారిని అడ్డగోలుగా మోసం చేస్తున్నారు. వీటిపై మరిన్ని దాడులు నిర్వహిస్తే యాజమాన్యాలు మెట్టు దిగే పరిస్థితి ఉంటుంది.










