May 31,2023 23:20

ఊడిపడిన స్లాబ్‌ను పరిశీలిస్త్నున్న అధికారులు

కార్పొరేషన్‌ ఉద్యోగులకు తప్పిన ప్రమాదం
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
కాకినాడ నగరపాలక సంస్థ పరిధి టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ కార్యాల యంలో బుధవారం టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌, ఇతర సిబ్బంది పనిచేసే హాలులో ఉన్న ట్టుండి సీలింగ్‌ ఊడిపడింది. దీంతో అధికారు లకు ఎటువంటి ప్రమాదం జరగకుండా తప్పించు కున్నారు. ఈ విషయమై అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు, డిఇ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనం నిర్మాణ పనుల్లో భాగంగా ఆయా విభాగాలను మారుస్తూ బాలభవన్‌ వద్ద ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఈ మధ్యకాలంలోనే నిర్మించిన సీలింగ్‌ ఊడిపడడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.