జీవితమంతా దీనిపై ఆలోచిస్తూ
భారంగా సాగిపోతుంది
ఈ ఉదాసీనత ఏ సంతోషంలో నన్నిలా
తీగలా పెనవేసుకునిపోతుంది
నేను ప్రతిరోజు నూతన ఉత్తేజంతో
నా పయనాన్ని మొదలెడుతున్నా
కానీ తెలీని దుఃఖమేదో తనలో
నన్ను కలుపుకుంటుంది
నేను ప్రతి క్షణాన్నీ సంతోషంగానే
గడపాలనుకుంటున్నాను కానీ,
విరచించలేని, నిర్వచించలేని కష్టాల
కడలి నన్ను తనలో ఐక్యం చేసుకుంటుంది
విచిత్రమైన దుఃఖముంది
నేను తనవాడినై కూడా తన్ను
స్పృశించడానికి భయపడుతున్నాను
నా భాగపు అగ్ని
ఇతరుల్లో పంచబడుతుంది
తనను కలవాలని బలమైన తలంపు
మది తలుపు తడుతూనే ఉంది కానీ,
తాను తెచ్చిన తలవంపులు కనువిప్పయి
మనసు కనులు తెరిపిస్తుంది
సర్ఫరాజ్ అన్వర్
94409 81198