Jul 14,2023 21:23

నిరసన చేస్తున్న ఎన్‌ఎస్‌యుఐ నాయకులు

 కడప : ఇంటర్‌ విదా ్యర్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిం చాలని, కార్పొరేట్‌, ప్రయివేట్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొ ంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఆర్‌ఐఒ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వాలని, కార్పొరేట్‌, ప్రయివేట్‌ కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరిక ట్టాలని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అందరికీ చదువు కునేందుకు పాఠ్యపుస్తకాలు ఇచ్చిందన్నారు రాష్ట్రంలో 439 ప్రభుత్వ, 131 ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులలో నూటికి 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులే ఉన్నార న్నారు. తాగునీరు, మరు గుదొడ్లు, ఫర్నిచర్‌, ల్యాబ్‌, లైబ్రరీ, తరగతి గదుల కొరత, లెక్చరర్ల లేమి వంటి సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నగర అధ్యక్షులు శ్రీహరి, ఫర్రోక్‌, మహేష్‌, తేజ, విజరు, రాజు, ప్రసాద్‌ జాకీర్‌, శ్రీకాంత్‌, నాగేంద్ర, సుబ్బయ్య, శివ పాల్గొన్నారు.