ప్రజాశక్తి - శ్రీకాకుళం లీగల్: పారాలీగల్ వాలంటీర్లు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన ఐదు రోజుల పాటు నిర్వహించే పారాలీగల్ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చట్టాలపై ప్రాథమిక అవగాహన అవసరమన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు, బార్ అసోసియేషన్ రిసోర్స్‌పర్సన్ అన్నెపు భువనేశ్వరరావు రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, విధులు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి, నరసన్నపేట, పలాస, పాలకొండ, రాజాం, సోంపేట, టెక్కలి, కొత్తూరు, పొందూరు, పలాస, పాతపట్నం కోర్టులకు చెందిన పారాలీగల్ వాలంటీర్లు ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.