శిబిరాన్ని ప్రారంభించిన సభ్యులు
ప్రజాశక్తి - ఆదోని
అవోపా ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పిల్లల వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవోపా అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్ గుప్త, కార్యదర్శి మిరియాల శ్రీధర్ కోరారు. 10 రోజులపాటు పట్టణంలోని ఆర్య వైశ్య హాస్టల్‌లో జరగనున్న ఉచిత పిల్లల వేసవి శిబిరాన్ని సౌజన్య కర్తలు, ఆర్య వైశ్య పఠనాలయం అధ్యక్ష, కార్యదర్శులు పాడేగల్ మురళీ, పాడేగల్ సనత్ గురువారం ప్రారంభించారు. శిబిరంలో అబకాస్, వేదిక్ మ్యాథ్స్, చెస్ కోచింగ్, మెహందీ డిజైన్ లాంటి ఎన్నో నైపుణ్య విద్యలను నేర్పుతున్నారన్నారు. సభ్యులు ప్రతాప్, ఈరన్న, మహిళా విభాగ్ సెక్రటరీ మమతాశ్రీ, సభ్యులు కవితశ్రీ, ప్రసన్న, తులసి, కీర్తి పాల్గొన్నారు.










