
ప్రజాశక్తి-గూడూరు : పేద,మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందించడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గూడూరు మండలం పోసిన వారి పాలెం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంత్రి జోగి రమేష్, జిల్లా కలెక్టర్ పి.రాజబాబుతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి జోగి రమేష్ ల్యాబ్‌లో స్వయంగా రక్తపోటు పరీక్ష చేయించు కున్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, ఎంపీపీ సంగా మధుసూదన రావు, జడ్పిటిసి వేముల రంగబాబు, పోసినవారిపాలెం సర్పంచ్ పిండి వెంకన్న బాబు, ఎంపీడీవో సుబ్బారావు, తహసిల్దార్ విజయ ప్రసాద్ పాల్గొన్నారు.