Apr 07,2023 17:49

ప్రారంభిస్తున్న జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్, ఐ ఎం ఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ

ఉచిత వైద్య శిబిరం విజయవంత0
ప్రజాశక్తి - నంద్యాల
    
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నంద్యాల ఐ ఎమ్ ఎ, నంద్యాల జిల్లా అటవీ శాఖ సంయుక్త నిర్వహణ లో, అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ ఉద్యోగులకు మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు.నంద్యాల ఐ ఏమ్ ఎ అధ్యక్షులు డాక్టర్ జఫరుల్ల అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్, ఐ.ఎం. ఎ. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు.వినీత్ కుమార్ మాట్లాడుతూ జబ్బుల వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ చెక్ అప్ చేయించుకోవడం అవసరం అన్నారు. తద్వార కొన్ని రోగాలు సరైన సమయంలో గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఐ. ఎం.ఎ. సమర్పణ దివస్ గా నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వైద్య అవగాహన సదస్సులు,శిబిరాలు ఏర్పాటు చేశారని అన్నారు.ఈ రోజు ఐ ఎం ఎ ప్రజా ఆరోగ్యం లక్ష్యంగా  పునరంకితం అవుతున్నదన్నారు. ఈ శిబిరంలో ఐ ఎం ఎ నంద్యాల శాఖ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కోశాధికారి డాక్టర్ అనిల్, వైద్యులు మధుసూదన రావు,సహదేవుడు, అనిల్ కుమార్, మురళీ కృష్ణ, వివేకానంద, విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ ,నీలా ప్రసాద్, భారతి, వసుధ, నర్మదా,సుసుమా, హరిత, భరత్, సునీతా,చంద్రశేఖర్ అటవీ శాఖ అధికారులు శివన్న, త్రినాథ్ రెడ్డి, జబ్, నాగేంద్ర నాయక్, జాకీర్ హుస్సేన్, విజయ లక్ష్మీ,  అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని వైద్య సలహాలు తీసుకున్నారు.  అవరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు.లయన్స్ జిల్లా చైర్మన్ శ్రీకాంత్ మందుల పంపిణి పర్యవేక్షణ చేసారు.ఉచితంగా సుగర్ పరీక్ష, ఇ.సి.జి , గుండె 2 డి ఎకో స్కానింగ్ పరీక్షలు చేసారు.