Aug 27,2023 20:24

మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్‌

ప్రజాశక్తి-నెల్లూరు :స్థానిక 13వ డివిజన్‌ పరిధిలోని యలమవారిదిన్నె ప్రాంతంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో రాజన్న గుండె భరోసా (ఉచిత గుండె వైద్య శిబిరం) నిర్వహించారు. ఆదివారం నగరంలోని ఎనెల్‌ వైద్యశాల యాజమాన్యం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్యశిబిరాన్ని నగర ఎంఎల్‌ఎ డాక్టర్‌ పి.అనీల్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న గుండె భరోసా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వైద్యశిబిరంలో పాల్గొన్న డాక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. అనంతరం డాక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ తాము ఇప్పటివరకు నిర్వహించిన వైద్యశిబిరాల్లో మొత్తం 1081 మందికి వైద్య పరీక్షలు, 550 మందికి పైగా ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నగర నియోజకవర్గ పరిధిలోని అన్నీ డివిజన్లలో ప్రతి వారం గుండె భరోసా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఊటుకూరు నాగార్జున, వైసిపి నాయకులు ఉన్నారు.