హాజరైనా నిర్వాహకులు
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండల కేంద్రంలో శారద నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణంలో శారద ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని శారద ట్రస్ట్ బోర్డు మెంబర్ రోజా, శారద ట్రస్టు గౌరవ సభ్యులు, గిరిజన మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ1 పాటు భోయి సత్యనారాయణ పాల్గొని రోగులకు ఆరోగ్యంపై అవగాహన పరచారు.వైద్య నిపుణులతో 205 మందికి వైద్య సేవలు అందించారు. రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అన్వేష్, ప్రేమ్ చంద్, రవితేజ్, పద్మ, లలిత, అరకు వ్యాలీ శారద నికేతన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరంజీవి, ట్రస్టు బోర్డు మెంబర్ రత్నం, దాసు, బుజ్జి బాబు, దొన్నో, పాల్గొన్నారు.










