ప్రజాశక్తి-యద్దనపూడి: మండలంలోని పూనూరు గ్రామ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏలూరి ట్రస్టు ఆధ్యర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మొదట ఎన్‌టిఆర్ విగ్రహానికి ఏలూరి నాగేశ్వరరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశిరావు మాట్లాడుతూ తన మొదటి ప్రాధాన్యత ప్రజా సేవే అని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏలూరి ట్రస్టు పని చేస్తుందని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో 450 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 175 మందికి శస్త్ర చికిత్సలకు నిర్ధారించారు. గ్రామాల నుంచి వచ్చిన వారికి అన్నదానం చేశారు. డాక్టర్ మమత, డాక్టర్ దృశ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచి బోయపాటి సాంబశివరావు, టిడిపి నాయకులు రంగయ్య చౌదరి, నాగేశ్వరరావు, వెంకట స్వామి, రసూల్, సురేష్, వాసు, అనిల్, కనకరాజు, అశోక్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు మరియు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.










