ప్రజాశక్తి - ఆదోని
ఆర్యవైశ్య అఫీషియల్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్ గుప్త, మిరియాల శ్రీధర్ కోరారు. గురువారం పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో ఆపరేషన్లు చేసుకున్న 258 మంది రోగులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేదలను ఆదుకోవాలని వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ల క్యాంపులు మున్ముందు నిర్వహిస్తామన్నారు. శిబిరాల నిర్వహణకు తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని దాత నాగేష్ కాకుబాళ్ తెలిపారు. శిబిరాల నిర్వహణకు వేదికను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నందుకు కల్యాణ మండప కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్ సురేష్, ఆవోపా ఉపాధ్యక్షులు ప్రతాప్, ఈరన్న శెట్టి, రంగనాయకులు, మహిళ విభాగ్ అధ్యక్ష, కార్యదర్శులు బూదూరు సంగీత, వంకదారు మమతా, సభ్యులు ప్రతాప్, హిమ బిందు, వంకదారు గీత, కవితశ్రీ, తులసి పాల్గొన్నారు.
లబ్ధిదారులతో నిర్వాహకులు










