ప్రజాశక్తి-బాపట్ల: స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ బాపట్ల టౌన్ అధ్యక్షులు శిఖరం ఫణిరాజశయన్ అన్నారు. ఆదివారం క్లబ్ ఆధ్వర్యంలో ఏషియన్ హాస్పిటల్ సౌజన్యంతో భవిష్య మాంటిసోరి (సాధన స్కూల్ క్యాంపస్) ప్రాంగణంలో వెరికోస్ వెయిన్స్ (నరాలు, పిక్కల బలహీనత)కు ఉచిత వైద్య శిబిరాన్ని ఏషియన్ హాస్పిటల్ వైద్యులు, క్లబ్ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రధానంగా నరాలు, పిక్కలు, కాళ్ల రుగ్మతలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. శిబిరంలో వందమందికి వెరికోస్ వెయిన్స్ (నరాలు పిక్కల బలహీనత)కు ఏషియన్ హాస్పిటల్ వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఉషారాణి, కోశాధికారి శివరామకృష్ణ, రీజియన్ చైర్మన్ గోపాళం రఘుపతి రావు, అలపర్తి శ్రీనివాస్‌రావు, యజ్ఞ నారాయణ, గుండ్రెడ్డి సత్యనారాయణ, సింగంసెట్టి సుబ్బారావు, శివ నాగేశ్వరమ్మ, లక్కాకుల వెంకటరావు, వక్కలగడ్డ శ్రీనివాసరావు, ఇక్కుర్తి శ్రీనివాసరావు, వంకాయలపాటి హరిబాబు, సుధాకర గుప్త, రజనీకాంత్, బాషా పాల్గొన్నారు.










