Oct 04,2023 20:51

కొత్తవలస: షుగర్‌ టెస్టు చేసుకుంటున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

ప్రజాశక్తి - జామి : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా గ్రామాల్లో ఉచిత వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని జడ్డేటివలస సచివాలయం పరిధిలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలోనే మెరుగైన ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారికి అందరూ అండగా నిలవాలని కోరారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు పై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు గొర్లె రవి, ఎంపిపి సబ్బవరపు అరుణ, వైస్‌ ఎంపిపి గేదెల వెంకటరావు, నాగమణి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.
కొత్తవలస: జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు ఎంతగానో దోహద పడుతుందని, ఈ అవకాశం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కంటకాపల్లి గ్రామ సచివాలయంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన వైద్య చికత్స చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు, జడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, గ్రామ సర్పంచ్‌ మదిన లక్ష్మి, డాక్టర్‌ సీతల్‌ వర్మ, మదిన అప్పలరాం, వైస్‌ ప్రెసిడెంట్‌ బొదల సుధాకర్‌, పిఎస్‌ఎన్‌ పాత్రుడు, మదిన ప్రకాష్‌, మేలాస్త్రి అప్పారావు, ఎంపిడిఒ వై. పద్మజ, పంచాయతీ కార్యదర్శి మాధవీలత, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: జగనన్న ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు. మండలంలోని సంతగైరమ్మపేట గ్రామ సచివాలయం వద్ద బుధవారం ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ పౌష్టికాహారాన్ని పరిశీలించారు. వైద్య శిబిరానికి వచ్చిన పలువురు వయోవృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు, సర్పంచ్‌ గోగాడ కళావతి, ఎంపిటిసి కూనిరెడ్డి శ్రీదేవి, నాయకులు రవిరాఘవరావు, గోగాడ అప్పారావు, గోగాడ శ్రీనివాసరావు, చలుమూరి దేముడు, గోగాడ ఈశ్వరరావు, గోగాడ కృష్ణంనాయుడు, పంచాయితీ విస్తరణాధికారి లక్ష్మి, వైద్యాధికారులు, పంచాయితీ కార్యదర్శులు, సచివాలయ, ఐసిడిఎస్‌, వైద్య సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
తెర్లాం: మండలంలోని గంగన్న పాడు సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ క్యాంపులో అంగన్వాడీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరు రకాల దినుసులతో 20 రకాల వంటకాలను తయారు చేసి స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎస్‌ రామకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్‌ భాస్కరరావు, వైస్‌ ఎంపిపి, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ వెంకటలక్ష్మి, సచివాలయ, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.
డెంకాడ: మండలంలోని సింగవరం పాఠశాల వద్ద బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 457 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు, వైస్‌ ఎంపిపి తమ్మినాయుడు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ఆదిలక్ష్మి, ప్రత్యేకాధికారి జమదగ్ని, సర్పంచ్‌ పి. అప్పారావు, ఉప సర్పంచ్‌ గురువులు, నాయకులు బి. రమణ, కృష్ణ, లెంక అప్పలనాయుడు, సచివాలయ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలోని గవర్నమెంట్‌ హై స్కూల్లో (సికెఎం) బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌ పర్సన్‌ బంగారు సరోజినీ, వైస్‌ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, నగర పంచాయతి కమిషనర్‌ పి. బాలాజీ ప్రసాద్‌, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, వివిధ బోర్డుల డైరెక్టర్లు, వైద్య, సచివాలయ, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొనారు.