
ప్రజాశక్తి -ఆనందపురం : మహిళలకు, రైతులకు, కార్మికులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు ఇవ్వనున్నట్లు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి.శేషమ్మ తెలిపారు. వేములవలస సచివాలయంలో విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యాన రైతులకు, రైతు కూలీలకు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ కూలీలకు మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. రైతు కూలీలకు, కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు, వాటి అమలును ప్రజలనడిగి శేషమ్మ తెలుసుకున్నారు.
కార్మికశాఖ ఉప కమిషనర్ ఎం.సునీత మాట్లాడుతూ, కార్మిక శాఖ ద్వారా అమలవుతున్న ఈ- శ్రమ కార్డులు, కనీస వేతనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భీమునిపట్నం వ్యవసాయ సహాయ సంచాలకులు బి.విజరుప్రసాద్, మండల వ్యవసాయాధికారి సిహెచ్.సంధ్యరత్నప్రభ, వ్యవసాయ సలహా మండలి సభ్యులు కోరాడ రాంబాబు, అప్పలస్వామి నాయుడు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు.