Nov 09,2023 21:35

మాట్లాడుతున్న జడ్జి

మాట్లాడుతున్న జడ్జి
ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చు
- సీనియర్‌ సివిల్‌ జడ్జి రాజేష్‌
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌: పేదలు న్యాయస్థానంలో ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి బి. రాజేష్‌ పేర్కొన్నారు. గురువారం జాతీయ న్యాయ సేవా దినోత్సవం పురస్కరించుకొని . కోర్టు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రాజేష్‌ మాట్లాడుతూ ప్రపంచంలో తొలిసారిగా 1851లో ఫ్యాన్స్‌ లో పేదలకు ఉచిత న్యాయ సహాయం అమలైందని, భారతదేశంలో 1987లో చట్టం అమలు చేసి పేదలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఎలా ఉందో పేదలకు ఉచితంగా న్యాయం పొందే హక్కు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన రాత పరీక్షలలో విజేతలైన వారికి డి.ఎస్‌.పి ఎన్‌ కోటారెడ్డి బహుమతులు అంద జేశారు. కార్యక్రమంలో సిఐ వేణు, ఎస్సై ముత్యాలరావు, బార్‌ అసోస ియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు చిన్నపరెడ్డి, ఐ మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎల్‌వి రమణయ్య, తిరుపతమ్మ, కె.వి శేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు
.