Sep 29,2022 23:03

మాట్లాడుతున్న న్యాయవాది పాపారావు

ప్రజాశక్తి- మధురవాడ : ఫీజు చెల్లించి న్యాయవాదులను పెట్టుకోలేని ప్రజలకు ఉచిత న్యాయ సాయం, సలహాలు, సూచనలు అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా వ్యాప్తంగా లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌లను నిర్వహిస్తోందని విశాఖ జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటి ప్యానల్‌ లాయర్‌ టి.పాపారావు అన్నారు. గురువారం గీతం వర్సిటీ అనుబంధ గీతం స్కూల్‌ ఆఫ్‌ లా ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహయ శిబిరం (లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌) నిర్వహించారు. అనేకమందిలో న్యాయపరమైన అవగాహన లేని పరిస్థితుల్లో, ఉన్నత న్యాయస్థానాలు సూచనల మేరకు లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లలో న్యాయశాస్త్ర విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. న్యాయసాయం కోసం గీతం వర్సిటీలోని లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను సంప్రదించవచ్చన్నారు. . సివిల్‌ మరియు క్రిమినల్‌ కేసులకు సంబంధించిన అంశాలపై ఉచిత న్యాయ సలహలను అందించారు గీతం న్యాయ సలహ కేంద్ర కన్వీనర్‌ డాక్టర్‌ సిహెచ్‌ లక్షణరావు మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో న్యాయ సేవాధికార సంస్థ సామాన్య ప్రజలకు న్యాయసాయం చేస్తోందన్నారు. గీతం లీగల్‌ ఎయిడ్‌ క్లీనిక్‌ల ద్వారా న్యాయనిపుణుల పర్యవేక్షణలో న్యాయశాస్త్ర విద్యార్థులు ప్రజల వద్దకే వెళ్ళి వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ఉచిత సేవలు అందిస్తారన్నారు. ఈసందర్భంగా సివిల్‌, క్రిమినల్‌ కేసులకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో న్యాయకళాశాల సీనియర్‌ ఫ్యాకల్టీ జె.ఉమారావు పాల్గొన్నారు.