ప్రజాశక్తి -మధురవాడ : జీవీఎంసీ 7వ వార్డు పరిధి నగరంపాలెం రోడ్డు వద్ద గల వెంకటేశ్వర విద్యాపీఠ్‌లో మేడే ఉత్సవాలలో భాగంగా గురువారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. స్కూల్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. 200మందికి కంటి పరీక్షలు జరిపి అవసరమైన మందులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా సిఐటియు జోన్ కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, పేదలకు వైద్యం అందుబాటులో లేదన్నారు. మురికివాడల్లో రోగాల పట్ల అవగాహన అవసరమన్నారు. రోటరీ క్లబ్, శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాజు, నాయకులు శ్రీనివాస్‌వర్మ, ఎన్‌జిఒ, ఐద్వా నాయకులు భారతి, రంగమ్మ, శంకర్ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ పాల్గొన్నారు.










