మజ్జిగ పంపిణీని ప్రారంభిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి- రేపల్లె : వేసవి నేపథ్యంలో రేపల్లె పట్టణ తెలుగు మహిళ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమతధార ఉచిత మజ్జిగ ఆవర రోజుకు చేరింది. మజ్జిగ పంపిణీని మాజీ ఎమ్మెల్యే ఎం. వెంకటసుబ్బయ్య ప్రారంభించారు. ఉచిత మజ్జిగ శిబిరం నిర్వహణ కోసం నిర్వాహకులకు రూ. 5 వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా సెల్ అధ్యక్షురాలు పొన్నూరు గౌరీ రామకుమారి,కార్యదర్శి మోర్ల అరుణ కుమారి,జిల్లా మహిళా కార్యదర్శి కామరాజుగడ్డ నాగశ్రీ, నియోజకవర్గ మహిళా సెల్ కార్యదర్శి కనికచర్ల శ్రీదేవి, టిడిపి పట్టణ అధ్యక్షుడు జిపి. రామారావు, జివి.నాగేశ్వరరావు, తాడిపర్తి మల్లికార్జునరావు, యేమినేని యానాదిరావు, వెనిగళ్ళ శివ సుబ్రహ్మణ్యం, బద్దెల సాయ, మల్లిపెద్ది రంగారావు, వడ్డి లక్మోజి పాల్గొన్నారు.










