ప్రజాశక్తి-రేపల్లె: ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విజయ సారధి అన్నారు. పట్టణంలోని రైలు పేటలో గల రాజరాజేశ్వరి దేవస్థానంలో బాలినేని వెంకటకృష్ణ ప్రసాదరావు ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రగతి నారి శక్తి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ తూనుగుంట్ల కాశీ విశ్వనాథ గుప్త ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ సారథి మాట్లాడుతూ తీర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఈ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రగతి నారీ శక్తి రాష్ట్ర ప్రెసిడెంట్ దేవబోయిన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో బిపి, షుగర్, ఆయాసం, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు, క్యాన్సర్ సమస్యలకు, ఎముకలకు సంబంధించిన సమస్యలకు ఉచితగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 108 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. క్యాంపులో ప్రముఖ వైద్యులు అఖిల్, శివరామకృష్ణ, అరుణాచలం, మిత్ర, రోహిత, వైద్యులు పాల్గొన్నారు.










