Dec 08,2022 23:57

నేత్ర పరీక్షలు చేస్తున్న శంకర్‌ ఫౌండేషన్‌ వైద్య సిబ్బంది

ప్రజాశక్తి - పరవాడ
మండలంలోని వాడచీపురుపల్లి గ్రామంలో అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో, శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రి వారిచే గురువారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దీనిని పరవాడ ఎంపిడిఒ హేమసుందరరావు ప్రారంభించారు. శంకర్‌ ఫౌండేషన్‌ కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ వరహాలు, క్యాంప్‌ డిప్యూటీ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ వైద్య సేవలు అందించారు. 169 మంది రోగులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్‌ పంపిణీ చేశారు. 30 మంది రోగులను కంటి ఆపరేషన్లకు ఎంపిక చేసి శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. గ్రామీణ ప్రాంతాలలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్న అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ బృందానికి ఎంపీడీవో హేమ సుందరరావు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరవాడ ప్రభుత్వ ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌ వెంకటరావు, ఎన్టీపీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ వై.రమేష్‌, పంచాయతీ కార్యదర్శి మురళీ పట్నాయక్‌, సబ్బవరపు గౌతమ్‌, అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గొంప వెంకట రావు, వైస్‌ చైర్మన్‌ సింగంపల్లి అర్జున, ట్రస్ట్‌ సభ్యులు సింగంపల్లి రామారావు, సింగంపల్లి నిఖిల్‌, పైల మురళి, ఎమ్‌ గణపతి, శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రి సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.