ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక రోటరీ క్లబ్, బిబిహెచ్ కాలేజీ 1992లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు, జిల్లా అందత్వ నివారణ సంస్థ సంయుక్తంగా బిబిహెచ్ జూనియర్ కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎం సుధీర్ కుమార్ ప్రారంభించారు. శంకర ఆస్పటల్ వైద్యులు బిపిన్ రుతున్ వైద్య పరీక్షలు చేశారు. శిబిరంలో 165మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. తక్షణం ఆపరేషన్ అవసరమైన 38మందిని వెంటనే బస్సులో శంకరా నేత్రాలయానికి తరలించినట్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బట్ట మోహనరావు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ సురేష్, గొల్లపూడి సీతారాం, కారంచేటి శివరామకృష్ణ, కొత్త వాసు, నున్న నాగేందర్రావు, పొగడదండ రవికుమార్, కదిరి భాష, టి కోటేశ్వరరావు, ప్రత్తి వెంకట సుబ్బారావు, దివి పవన్, వెంకటేశ్వర్లు, పద్మనాభుని శ్రీనివాసరావు పాల్గొన్నారు.










