Jun 05,2023 01:55
మాట్లాడుతున్న రితిక్‌ సాయి

ప్రజాశక్తి-రేపల్లె: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రితిక్‌ సాయి అన్నారు. పట్టణంలోని వీరవల్లి కోటయ్య ఫంక్షన్‌ హాల్‌లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డిఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితిక్‌ సాయి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఆశయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రేపల్లె రూరల్‌ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లద్దాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆపరేషన్‌ అవసరం అయిన వారికి ఉచితంగా ఆపరేషన్‌ చేసి పంపించనునట్లు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు ఎమ్‌ఎమ్‌ సక్సేనా, డాక్టర్‌ వసంతం వీరారాఘవయ్య పాల్గొన్నారు.