Aug 21,2022 22:37

మందులు అందజేస్తున్న వైద్యసిబ్బంది, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-గాజువాక : సిఐటియు ఆధ్వర్యాన స్ఫూర్తి హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో పెదగంట్యాడ సిఐటియు కార్యాలయం వద్ద ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్‌ రవికుమార్‌ సుమారు 85 మందికి కంటి పరీక్షలు జరిపి, ఉచితంగా మందులు అందించారు. 50 శాతం సబ్సిడీతో కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఐదుగురికి ఆపరేషన్‌ నిమిత్తం అవసరమైన ఏర్పాట్లు చేశారు. సిఐటియు స్టీల్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు ప్రారంభించిన ఈ కంటి వైద్య శిబిరంలో సిఐటియు నాయకులు పాల అప్పలరెడ్డి, కణితి అప్పలరాజు, వి.గణేష్‌, పాల వెంకయ్య, సిహెచ్‌ రాముడు, బి.ఆనంద్‌, స్ఫూర్తి వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సభ్యులు సాగర్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.