Nov 16,2023 20:26

కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి - ఆదోని
ఆదోని లయన్స్‌ క్లబ్‌, సాయి కృష్ణ కంటి ఆస్పత్రి, కెహెచ్‌జిఎన్‌ దంత వైద్యశాల సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గురువారం మండలంలోని ఆరేకల్‌లోని బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో నిర్వహించిన శిబిరానికి విశేష స్పందన లభించిందని లయన్స్‌ క్లబ్‌ జిల్లా ఛైర్మన్‌ డాక్టర్‌ గోపీనాథ్‌ తెలిపారు. శిబిరంలో దాదాపు 400 మంది బాలికలను పరీక్షించి తగిన సూచనలు ఇచ్చారన్నారు. ప్రముఖ కంటి వైద్యులు కృష్ణమూర్తి, ఉషారావు, ప్రముఖ దంత వైద్యులు అల్తాఫ్‌ హుస్సేన్‌, ఆయేషా, లయన్స్‌ క్లబ్‌ రీజియన్‌ ఛైర్మన్‌ ప్రసాదరావు, పట్టణ అధ్యక్షులు ధర్మారెడ్డి, ఈసీ మెంబర్‌ వనపరాజు పాల్గొన్నారు.