Jun 03,2023 19:28

శిబిరం నిర్వహిస్తున్న సభ్యులు

ప్రజాశక్తి - ఆదోని
ఆర్యవైశ్య ఆఫీషియల్స్‌, ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌, అవోపా మహిళా విభాగ్‌ ఆదోని వారి ఆధ్వర్యంలో విశ్వభారతి హాస్పిటల్‌ కర్నూలు వారి సౌజన్యంతో కాకుబాల్‌ నాగేష్‌ సమక్షంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి ఆపరేషన్‌ మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. వాసవీ కల్యాణ మండలపంలో జరిగిన శిబిరంలో 853 మంది రోగులకు కంటి పరీక్షలు చేశారు. వీరిలో 258 కంటి ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఉన్నందున ఎంపిక చేసినట్లు అవోపా ప్రెసిడెంట్‌ వంకదారి శ్రీనాథ్‌ గుప్త తెలిపారు. ఆపరేషన్‌ కోసం వెళ్లే వారికి రవాణా సౌకర్యం, భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో నిర్వహిస్తామన్నారు. అధ్యక్ష, కార్యదర్శులు వంకదారి శ్రీనాథ్‌ గుప్త, మిరియాల శ్రీధర్‌, సభ్యులు ప్రతాప్‌, ఈరన్న, రత్నయ్య, రంగనాయకులు, రాంప్రసాద్‌, రమేష్‌, మహిళా విభాగ్‌ కార్యదర్శి మమతశ్రీ, సభ్యులు హిమబిందు, గీత, పూజ, కీర్తి, తులసి, సౌజన్య, సంధ్య, శోభ, సంతోషి పాల్గొన్నారు.