Apr 28,2023 21:44

ప్రజాశక్తి - ఏలూరు
             ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కమిటీ కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగ యువత కోసం ఐదు రకాల కోర్సులు నైపుణ్యంగా నేర్పడం అభినందనీయమని నీటిపారుదల శాఖ జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ కె.శ్రీనివాసరావు అన్నారు. ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కమిటీ కంప్యూటర్‌ శిక్షణ పొందిన 20వ బ్యాచ్‌ వారికి సర్టిఫికెట్లు ప్రదానం పవర్‌పేటలో అన్నే భవనంలో గుడిపాటి నరసింహరావు అధ్యక్షతన నిర్వహించారు. 20 మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా కె.శ్రీనివాసరావు, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ వై.అర్జునరావు, హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ పి.కస్తూరిబాయి, శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్‌ బి.పూర్ణచంద్‌, ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు ఎస్‌.రవి, డి.గణేష్‌ పాల్గొన్నారు.