ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : ఉబ్బెకిస్తాన్‌లో వైద్య విద్యను అభ్యసించే వారికోసం తాష్కెంట్ మెడికల్ అకాడ మి టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఆవిష్కరిం చినట్లు ఉబ్బెకిస్తాన్ భారత ప్రతినిధి డాక్టర్ దివ్య రాజ్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం ఉబ్బెకిస్తాన్ వైద్య విద్యపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాష్కెంట్ మెడికల్ అకాడమిలో వైద్య విద్యను చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో టీఎంఎ దక్షిణాసియా ప్రతినిధి కార్యాలయం ప్రారంభించారని దీని ద్వారా రూ.5 లక్షల వరకు స్కాలర్‌షిప్‌తనో స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నారని తెలిపారు. రాష్ట్ర భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు మాట్లాడుతూ నియో ఇనిస్టిట్యూట్ ద్వారా విద్యార్థులు తాష్కెంట్ మెడికల్ అకాడమి ద్వారా వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉందని తెలిపారు. చక్కటి విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ అధ్యాపక బృందంతో వైద్య విద్యను చదువుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పూర్తిస్థాయి భారతీయ ఆహారంతో పాటు హాస్టల్ సదుపాయాలు, స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తుందని తెలిపారు. డాక్టర్ జాసూర్ బేగ్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థులు మిగతా విద్యార్థులతో పోటీపడి చక్కగా రాణిస్తున్నారని అన్నారు. 600 మంది విద్యార్థులలో 100 మంది తెలుగు విద్యార్థులు తాష్కెంట్ మెడికల్ అకాడమిలో చదువుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అకాడమి అసిస్టెంట్ రెక్టార్ ఎస్.అక్రంజోన్ పలువురు యూనివర్శిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.










