ప్రజాశక్తి-పెదబయలు : మండల కేంద్రంలో జరుగు సోమవారపు సంతలో గిరిజనులు తెచ్చిన వాణిజ్య పంట పసుపు శావుకారుల మోసాలకు ప్రతివారం బాలవుతున్నారు. ముదువారాల క్రితం కిలో పసుపు 60 రూపాయలు ఈ వారం 40 రూపాయలు మాత్రమే విక్రయాలు జరిగాయి, వ్యాపారులు దళారులతో ముందస్తుగా మాట్లాడి శావుకారులు రాకుండా దళారులతో చేతిలో కొనుగోలు చేపిస్తున్నారు మారుమూల ప్రాంతాల నుండి వాహనాల్లో సంతకు తెచ్చిన పసుపు గిట్టుబాటు ధర పాలకకపోవడంతో దిక్కుతోచని స్థితిలో గిరిజన వ్యాపారు లు ఆందోళన చెండుతున్నారు. కనీసరవాణా చార్జీలు కూడా లభించడం లేదని తల బడుకొంటున్నారు గ్రామాల్లో కొన్న ధరనే మార్కెట్లో విక్రహిస్తుండటం పసుపు రైతు వ్యాపారుల మోహంలో చిరునవ్వు లేకుండా ఊసురోమణి తిరుగు మొహం పడుతున్నారు. దళారులతో మోసానికి అవధులలేకుండా పోతుందటం అధికారుల జాడ లేకపోవడంతో సంతల్లో దళారుల మోసాలు అరికట్టలేని దుస్థితి నెలకొంది. వరపు సంతకు తెచ్చిన పసుపు అమ్ముడు పోక నిలువ ఉంచలేక బస్థలతో మార్కెట్లోనే స్టోరేజ్ చేస్తున్నారు పాడేరు ఐ టి డి ఎ ఆధ్వర్యంలో నడపబడుతున్న జి సి సి కొనుగోలు చేయాలనీ ప్రశాంఘాలైన సిపిఎం గిరిజన సంఘాలు పలుమార్లు పెద్ద ఎత్తున ఆందోళనలు స్థానిక అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన సంబంధిత అధికారులు కనీసం స్పందించక పోవడం విడ్డురంగా ఉంది. ఆదివాసి గిరిజనులు తెచ్చిన పసుపు గిట్టుబాటు ధర కల్పిస్తూ జిసిసి కొనుగోలు చేయాలనీ స్థానికులు ప్రభుత్వానికి కోరుతున్నారు.










