Aug 03,2021 18:36

శ్రీనగర్‌ : జమ్మూ- కాశ్మీర్‌ పోలీసులు టాప్‌-10 ఉగ్రవాదుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాను కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు సోమవారం అర్థరాత్రి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వీరిలో కొద్ది కాలంగా చురుగ్గా ఉన్న ఏడుగురితోపాటు ముగ్గురు కొత్త ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్‌ ఐజిపి విజరు కుమార్‌ ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ''టాప్‌-10 టార్గెట్స్‌ : పాత ఉగ్రవాదులు : సలీం పర్రారు, యుసఫ్‌ కంట్రూ, అబ్బాస్‌ షేక్‌, రియాజ్‌ షెటెర్గండ్‌, ఫరూఖ్‌ నాలీ, జుబెయిర్‌ వాని, అష్రఫ్‌ మోల్వీ. కొత్త ఉగ్రవాదులు : సకీబ్‌ మంజూర్‌, ఉమర్‌ ముస్తాక్‌ ఖండే, వకీల్‌ షా'' అని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు.