Jul 26,2021 17:03

టోక్యో ఒలింపిక్స్‌లో పదమూడేళ్ల చిన్నారి బంగారు పతకం సాధించింది. జపాన్‌కు చెందిన మోమిజీ నిషియా (13) స్కేటింగ్‌ పోటీలో గోల్డ్‌మెడల్‌ గెలుచుకుంది.  దీంతో ఆ దేశంలోనే అతి చిన్న వయసు గల బంగారు పతక విజేతగా నిషియా నిలిచింది. బంగారు పతకం సాధించినందుకు ఆ చిన్నారి ఆనందంతో కన్నీటి పర్యంతమైంది. ఈ సందర్భంగా నిషియా మాట్లాడుతూ.. 'కీలకమైన రెండు ల్యాండింగుల్ని తొందరపడి ల్యాండ్‌ సరిగ్గా చేయలేదు. దీంతో నేనెంతో ఒత్తిడికి గురయ్యాను. ఆ తరువాత చివరి మూడు స్థానాలను దక్కించుకున్నాను. ఆ తర్వాత నాల్గొవ రౌండ్‌లో ప్రాడిజీ లీల్‌ కంటే 4.66 సంపాదించి గోల్డ్‌మెడల్‌ సాధించాను. స్కేటింగ్‌లో ఎక్కువమంది ప్రత్యర్థులే ఉండాలి. లేకపోతే స్కేటింగ్‌లో సరదా ఉండదు' అని అన్నారు. ఇక దీనిపై ఆమె జట్టు సహచరుడు అయోరి నిషిమురా (19) 'ఎన్నో ఒత్తిళ్ల మధ్య పొరపాట్లు చేసినా.. చివరికి బంగారు పతకం సాధించేంతవరకు నిషియా కష్టపడింది' అని చెప్పారు. దీనిపై కాంస్య పతాక విజేత నకాయామా స్పందిస్తూ.. నిషియా విజయం.. మరెంతోమంది యువతులు జపనీస్‌ క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సాహాన్నిస్తుందని నమ్ముతున్నాను అని అన్నారు.
ఇక సోమవారం ఆమెతో ఒలింపిక్‌ పోడియంలో మరో ఇద్దరు మహిళా అథ్లెట్లు విజయం సాధించారు. ఒకరు కాంస్య పతకం, మరొకరు వెండి పతకాలను సాధించారు. పురుషుల ఈవెంట్లలో కాల్విన్‌ హోప్లెర్‌ ఆదివారం రెండవ స్థానంలో నిలిచిన తరువాత స్కేట్‌బోర్డింగ్‌లో బ్రెజిల్‌కు రెండవ రజతం రేసా లీల్‌కు ద్కింది. జపాన్‌కు చెందిన పూనా నకయామా కాంస్యం సాధించాడు.