Aug 07,2021 17:08

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని ముకుల్‌ రాయ్  వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తన తప్పును తెలుసుకుని నాలిక్కరుచుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో బిజెపి టిక్కెట్‌పై కృష్ణానగర్‌ నార్త్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచిన ముకుల్‌ రాయ్ , తర్వాత మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. తన నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు. ఆసమయంలో  బిజెపి గెలుస్తుందని అన్నారు. తన పొరపాటును సరిదిద్దుకుంటూ.. తన ఉద్దేశం టిఎంసి విజయం సాధిస్తుందని చెప్పడమేనని వివరణ ఇచ్చారు. గెలుస్తుందని చెప్పడమేనంటూ వివరణ ఇచ్చారు. ''అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి గెలుస్తుంది. త్రిపురలోనూ గెలుస్తుంది. అందులో అనుమానమే లేదు'' అని ఆయన తొలుత వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. వెంటనే తన పొరపాటును గ్రహించిన ముకుల్‌ రాయ్  టిఎంసి నిస్సందేహంగా ఉప ఎన్నికల్లో గెలుస్తుందని, బిజెపి ఓటమి చవిచూస్తుందని చెప్పడమని అన్నారు. బెంగాల్‌లోనే కాకుండా త్రిపురలోనూ టిఎంసి ఖాతా తెరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ముకుల్‌ రాయ్  కృష్ణానగర్‌ నార్త్‌ ఓటర్లను వంచించారని బిజెపి ప్రతినిధిó సంబిత్‌ పాత్ర పేర్కొన్నారు.