Oct 22,2023 13:48

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న చిత్రానికి మేకర్స్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే టైటిల్ కి ఖరారు చేశారు. ఈ మేరకు రాహుల్ రవీంద్రన్ టైటిల్ పోస్టర్ ను ట్వీట్ చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట #RaGaRa(రష్మిక, గీత, రాహుల్) అంటూ మేకింగ్ టైటిల్ పెట్టారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టైటిల్ ని విడుదల చేస్తూ దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఇందులో రష్మిక వాటర్ లో మునిగి ఉండగా… తన కళ్లతో ఎమోషన్ అవుతూ కనిపిస్తుంది. ఈ సమయంలో ‘ఆ పిల్ల నాది’ అంటూ వచ్చిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంటుంది. అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ టైటిల్ మరింతగా కట్టిపడేస్తుంది.