
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి-2021 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలో విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను విద్యార్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్-2021 ఫలితాలతోపాటు మార్చి-2020 ఫలితాలను కూడా మంత్రి విడుదల చేస్తారని వెల్లడించారు. ఈ రెండు విద్యా సంవత్సరాల ఫలితాలు గ్రేడుల్లో విడుదల కానున్నాయి. అభ్యర్థులు మార్కుల మెమోను వారు చదువుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి పొందాల్సి ఉంటుంది.