Jul 19,2023 19:38

ప్రజాశక్తి - గోనెగండ్ల : కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో బోయ జయరాముడు అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గోనెగండ్ల ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు హచ్ కైరవాడి గ్రామానికి చెందిన బోయ జయరాముడు(27) అనే వ్యక్తికి భార్య జయలక్ష్మి తో పాటు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. గత కొన్ని ఏళ్లుగా అతను తనకున్న రెండున్నర ఎకరాల పొలంతో పాటు నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసుకుంటున్నాడు.గత మూడు సంవత్సరాలుగా పంటలు సరిగా రాక సుమారు రెండు లక్షల పైగా అప్పులు చేసుకున్నాడు.అప్పులు తీర్చలేక మంగళవారం ఉదయం పొలంలోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబ సభ్యులు108 అంబులెన్స్ లో చికిత్స కొరకు కర్నూలు వైద్యశాలకు తరలించారు.అక్కడ కోలుకోలేక  బుధవారం మృతి చెందాడని మృతుని భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.