ప్రజాశక్తి-విఅర్ పురం : మండలంలోని మన్యం ప్రాంతం అంటే చల్లగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే తెల్లవారితే చాలు సూర్యకిరణాలు ప్రతి చోట విస్తరిస్తాయి. అదేవిధంగా నేను తలచుకుంటే ఎవరిని విడిచిపెట్టను అన్నట్లు బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మన్యంలో ఉండే పచ్చదనాన్ని అక్రమార్కులు గుడ్డలు వేటుకు బలి దీంతో వర్షాలు కురవడం లేదు. నా సహచర మిత్రులను ఇబ్బందులు పెడుతున్నారు వారి అంతానికి పునాదులు వేస్తున్నారని భావించిన భానుడు నిప్పులు కక్కుతూ ఏజెన్సీ మైదానం అనే భేదం లేకుండా తన ప్రతాపాన్ని చూపుతూ ప్రజలను ఇబ్బందులు పాలు మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, వడగాలులకు తోడు తీవ్రమైన ఎండలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం వర్షాలతో ప్రజలు కాస్త ఉపశమనం పొందినా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రంగా ఎండలు బాబోయ్ ఎండలు అనే ప్రతి ఒక్కరూ దగ్గర నుంచి వస్తున్న మాటా...! గతానికి భిన్నంగా ఏజెన్సీలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఎండ మండించినా సాయంత్రానికి వర్షం కురిసేది, గత రెండు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి, వర్షాలు కురవడం లేదు, ఎండలు రేకెత్తిస్తున్నాయి. మండు వేసవిలోనూ చల్లని వాతావరణంలో ఆకట్టుకునే వి ఆర్ పురం మండలంలో అత్యధికంగా 41 నుంచి 48డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యుడు నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు, సూర్యుడి ప్రతాపం తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో అయితే ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు, కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పెరుగుతున్న ఎండ తీవ్రతకు తోడుగా పు వడగాల్పులు కూడా వస్తున్నాయి. దాంతో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి, ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగానే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేసవి కాలంలో బయటకు వెళ్లాలంటే జాగ్రత్తలు అవసరమని తప్పకుండా పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరైనా బయటకు వెళ్లాలంటే తలకు తప్పనిసరిగా వస్త్రం కట్టుకోవాలని, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని చెప్తున్నారు, పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరమని వివరిస్తున్నారు. ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని పనులు సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే చేసేలా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఎండ కాలంలో నీటిని అధికంగా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు ఫ్రూట్ జ్యూస్ తో పాటు నిమ్మరసాలు తీసుకుని ఎండల నుంచి ఉపశమనం పొందవచ్చని వివరిస్తున్నారు వి ఆర్ పురం మండల సిపిఎం కార్యదర్శి సోయం. చిన్నబాబు చలివేంద్రాలు మజ్జిగ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు










