
గురువు వెలిగే దీపం
గురువు ఒక దివ్య వరం
విజయ మార్గం చూపే
తొలి వెలుగుల దివ్య పథం
గురువు ఒక కల్పతరువు
గురువు నిలుపును పరువు
మనలో జిజ్ఞాస పెంచి
తీర్చు జ్ఞాన దాహపు కరువు
గురువు అందరి దైవం
గురువే ఒక నమ్మకం!
గురువే మన బతుకుకు
అందించును జయం జయం!
గురువే చదువుల రేడు
గురువే బాపును కీడు!
గురువు చూపిన మేలును
మరువబోకు ఏనాడూ!
గురువే అక్షర జ్యోతి
గురువే ఆశాజ్యోతి!
గురువు నిత్యం వెలిగే
ఆరని విజ్ఞాన జ్యోతి!
- రావిపల్లి వాసుదేవరావు,
94417 13136.