
గురువే విజ్ఞానం
గురువే ఆనందం
గురువే మన మార్గం
గురువే మన జీవనం
గురువుతో అనుబంధం
ఆయువుతో సమానం
గురువే మన నేస్తం
గురుతు నేర్పిన ప్రాణం
గురువులోని సారం
శిష్యులకే సొంతం
గురువే మన శిల్పి
రగిలించే స్ఫూర్తి
గురువులోని గొప్పతనం
తెలుసుకుంటే ఆనందం
గురువే మన మూలధనం
నడిపించే ఇంధనం
గురువే గొప్పతరువు
సేద తీర్చు కడవరకు
చందమామ గురువు
వెలుగు లీను బతుకు
గురువంటే దైవం
గురువంటే నమ్మకం
గురువే మన జయం
గుర్తు పెట్టుకో ప్రతిక్షణం
చందనపు సౌరభం
గురువు నేర్పు పాఠం
గురువే మన ధ్యానం
క్రమశిక్షణ జీవితం
- మొర్రి గోపి,
8897882202.