ప్రజాశక్తి-పెదబయలు : దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేరిట గుంటూరు యూనివర్సిటీని వైస్ రాజశేఖరరెడ్డి పేరిట రాష్ట్ర ప్రభుత్వం మార్చాలని ప్రయత్నంలో భాగంగా పెదబయలు మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి జంక్షన్ వద్ద సోమవారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీకారి సుమారు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా అరకు నియోజకవర్గం ఇంచార్జి మాజీ మంత్రి కిడారి శ్రవాన్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం అయన ఎన్ టి ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నిరాహారధిక్షను ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ రాష్ట్రానికి స్వ పరిపాలన కావాలంటే టిడిపీతోనే సాధ్యమన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమం గిరిజన అభివృద్ధి గాలికి వదలి అరాచకపరిపాలన సాగిస్తుందన్నారు. ప్రభుత్వానికి చేతనైతే గిరిజన ప్రాంతంలో ఐఐటిలు మెడికల్ యూనివర్సిటీలు మంజూరు చేయాలనీ అంతే కానీ దివంగత నేత ఎన్ టి ఆర్ పేరు మారిస్తే స్వపరిపాలన కాదన్నారు. ఎన్ టి ఆర్ పేరు మార్చడం సరికాదన్నారు. వైస్సార్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటినుండి నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. నిరుద్యోగులకు ప్రత్యేక డి ఏస్ సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ భర్తీలు చెయ్యాలన్నారు. మద్యపానం నిషేధం లేదని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమబడ్డీకరణ చేయలేదని ఏడాదికి ఉద్యోగ కేలండర్ విడుదల చేస్తామని ప్రభుత్వ ఉద్యోగం ఏడాదికి విడుదల చేయాల్సిన కేలండర్ చేయలేదని నిరుద్యోగలకు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. డ్వాక్రా మహిళలకు ఆర్థికఅభివృద్ధికి నిరుత్స పరచరన్నారు. జగన్ కుటుంబసభ్యురాలైన షర్మిలయే వ్యతిరేకిస్తుందన్నారు. విద్యార్థులకు యూనిపారం ఇచ్చి కుట్టుకులు ఇవ్వలేని వైస్సార్సీపీ ప్రభుత్వం అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ వి కొండయ్య మాజీ సర్పంచి తైసాబు త్రినాడ్ దారేలా సర్పంచ్ పాంగి పాండు రంగా స్వామి అరకు రైతు సంఘము అధ్యక్షులు కూడా భూషణం అరకు పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వర్రావు వైస్ ఎంపీపీ పాంగి సోనే బొరాగం అప్పారావు మురళి టిడిపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు










