May 25,2023 15:34

ప్రజాశక్తి-వాకాడు : చిట్టమూరు మండలం మెట్టు గ్రామం నందు గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు కలిసి అక్రమ ఇసుక నిల్వలపైనిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు మాట్లాడుతూ స్వర్ణముఖి నది నందు ఇసుక రీచ్ లు ఏర్పాటు చేసి ఇసుకను అక్రమంగా తరలించడం వలన, చిట్టమూరు మండలం నందున్న ప్రజలకు త్రాగు నీరు, సాగు నీరు, స్వర్ణముఖి నది చుట్టు ప్రక్కల గ్రామాల వారికి నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. కావున మాజీ శాసన సభ్యులు, పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు చిట్టమూరు మండలం మెట్టు గ్రామం నందున్న ఇసుక రీచ్ దగ్గర మండల నాయకులు కార్యకర్తలతో కలసి అక్రమంగా తవ్వుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే ఆపాలని దాని ద్వారా భూగర్భ జలాల నిల్వలను పెరిగేలా చూడాలని నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్నెమాల జనార్దన్ రెడ్డి, గుండు బోయిన కస్తూరయ్య, చిన్నారావు, సునీల్ రెడ్డి, బిల్లు చెంచు రామయ్య తదితరులు పాల్గొన్నారు.