ప్రజాశక్తి-రామచంద్రపురం : జాతీయ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ "బాబుతో నేను" ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహారదీక్షలు కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం తెలుగుదేశంపార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రిలే నిరాహార నిరసన దీక్ష 17వ రోజు జరిగింది. ముందుగా అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండలపార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దీక్షకు మద్దతుగా విభిన్న ప్రతిభావంతులు బుంగా అబ్బులు ఎర్ర పోతవరం టిడిపి నాయకులు నేలపాటి వెంకటరమణ, పట్టణ పార్టీ నాయకులు గరికిపాటి సూర్యనారాయణ, తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.










