
ప్రజాశక్తి-గుంటూరు : కృష్ణ పశ్చిమ డెల్టాలో ఎండుతున్న వరి పంటలకు వెంటనే నీరు ఇవ్వాలని కోరుకుంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే దూళిపాల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో గుంటూరులోని నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. నేటి విడుదలలో తగిన ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని నరేంద్ర కుమార్ కి సందర్భంగా ఆరోపించారు. చేబ్రోలు మండలంకి చెందిన రైతులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. వరికి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.