Sep 20,2023 17:23
  • కారంచేడులో వినూత్న నిరసన

 ప్రజాశక్తి-కారంచేడు : మాజీ ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రను ఖండిస్తూ కారంచేడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  చంద్రబాబుకు తోడుగా ఉన్నామంటూ  రాజమండ్రి కేంద్రకారాగారానికి 200 మంది కార్యకర్తలు పోస్ట్ కార్డులు ఉద్యమం ప్రారంభించారు. అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 12వ రోజు నిరసనలో భాగంగా మాజీ ఎంపీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు కంభంపాటి నరేంద్ర, పాతూరి ఆదిలక్ష్మి, పోతిన వెంకటేశ్వర్లు, కొల్లా భాస్కరరావు, తాళ్లూరి అనిల్ కుమార్,  రామచంద్రరావు యార్లగడ్డ సాయి కృష్ణ, మహిళ అభిమానులు పాల్గొన్నారు.