ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధరనెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త ఇంచార్జి భీమినేని చిట్టిబాబు ని శనివారం పత్రికలలో వైసీపీ నాయకుడు బట్టే సుబ్రహ్మణ్యం చేసిన విమర్శలను వెదురుకుప్పం టీడీపి మండల నాయకులు కిషన్ చంద్ చాణుక్య ప్రతాప్ తీవ్రంగా ఖండించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. ''ఆయన వ్యాఖ్యలలో ఎటువంటి వాస్తవము లేదని, ఎవరు స్క్రిప్ట్ వ్రాస్తే ఎవరు చదువుతున్నారో మాకు బాగా తెలుసు. మీరు సాయంత్రం అయితే ఏ ఏ అసమ్మతి, బహిష్కృత నాయకులతో కలసి, మీతో ఈ వ్యాఖ్యలు వ్రాయిస్తున్నారో మాకు బాగా తెలుసు. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధిని విమర్శించి ప్రశ్నించే హక్కు ప్రతి ఓటర్ కి ఉంటుంది, మరి అలాంటిది ఈ నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జి అయిన చిట్టిబాబుకు, మంత్రి నారాయణస్వామిని విమర్శించే అర్హత లేదనడం సమంజసం కాదు. మరి నీకు ఏ అర్హత ఉందని చిట్టిబాబును విమర్శిస్తున్నావు. జీడీ నెల్లూరు నియోజకవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయిస్తే, మరి చిట్టిబాబుకు ఎందుకు ఇంచార్జి పదవి ఇచ్చారు అని ప్రశ్నించే ముందు, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం లిక్కర్ మినిస్టర్ కొనసాగుతూ ఉన్నా, కొందరు అగ్రవర్ణ నాయకులు విజయానంద రెడ్డి, పెద్దిరెడ్డి పెత్తనం, హవా ఎందుకు నడుస్తుందో చెప్పాలి? కీలకమైన నిర్ణయాల్లో వారి జోక్యం ఎదుకు ఉంటుందో చెప్పండి. చిట్టిబాబు ఇంచార్జి అయ్యిన తరువాత టిడిపి శ్రేణుల్లో నూతనోత్సవం నింపి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకొంటూ, దానికి కావాల్సిన ఖర్చులను భరించుకొని, ప్రతి మండలంలో పార్టీ ఆఫీస్ ని తన స్వంత నిధులును కేటాయిస్తూ, రేపు మాపో మా అధిష్టానం ప్రకటించబోయే దళిత ఎమ్మెల్యే అభ్యర్థికి కావాల్సిన అన్ని అర్హతలు ఇప్పటినుంచి చిట్టిబాబు సమీకరించుకొంటూ, పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. కాబట్టి చిట్టిబాబు పైన మీరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మీకు అప్పగించిన వెదురుకుప్పం మండలం ఎమ్మెల్సీ ఏక్టన్ బాధ్యతలు ఎందుకు విఫలం అయ్యారు. మీరు డబ్బులు ఆశ చూపించిన ప్రజలు ఎందుకు మిమల్ని ఓడించారో దానిపైన దృష్టి పెట్టండి, కనీసం ఎమ్మెల్యే ఎన్నికలలో మీకు డిపాజిట్లన్నా మిగులుతాయి. అలానే నారాయణస్వామి వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేరనీయకుండా అడ్డుకుంటున్నారు. ఓటు బ్యాంక్ పోతుందని మండలంలోని అన్నీ కులాలకు ద్రోహం చేస్తున్నారు. దీనికి మీ వైసీపీ మండల నాయకులు ఏమి సమాధానం చెప్తారని'' టీడీపి నాయకులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గంగయ్య, చంద్రబాబురెడ్డి, మారేపల్లి మురళి జయచంద్ర పాల్గొన్నారు.










