- కమల్నాథ్ ఆచారి మరణం పార్టీకి తీరని లోటు
ప్రజాశక్తి-పాకాల: సూరినేనిపల్లిలో తెలుగుదేశం పార్టీ కమల్నాథ్ ఆచారి కుటుంబాన్ని శనివారం తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినిల్ పరామర్శించారు. కమల మృతదేహానికి పులివర్తి వినిల్ మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కమల్నాథ్ ఆచారి మరణం పార్టీకి తీరని లోటు అని, పార్టీకి ఎనలేని సేవలు చేస్తారని అన్నారు .వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా అన్నారు ఉంటుందని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రశేఖర్ నాయుడు, కొంగర బాలాజీ, దామోదర్ నాయుడు, కృష్ణమూర్తి, సురేష్ ఆచారి, వాసు ఆచారి, రవి, కిరణ్, వాసు ఆచారి, భరత్ నాయుడు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.










