Jul 22,2023 00:04

మృతులు శివశంకర్‌, రామకృష్ణ

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌ : ట్యాంకర్‌ను కారు ఢకొీన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మార్టూరు సమీపంలోని కోనంకి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మార్టూరు సిఐ థెరిస్సా ఫిరోజ్‌ కథనం ప్రకారం.. మార్టూరు మండల పరిధిలోని డేగర్లమూడి, బల్లికురవ మండల పరిధిలోని కె.రాజుపాలెం గ్రామాలకు చెందిన కొండపల్లి శివశంకర్‌ (39), నల్లపనేని రామకష్ణ (35), ద్వారకపాడు ,కోనంకి గ్రామాలకు చెందిన వెంకట్రావు (36),అనిల్‌ కలిసి కారులో ఒంగోలు వెళ్లి తిరిగి వస్తున్నారు. కారు కోనంకి సమీపంలోకి వెళుతుండగా జాతీయ రహదారిపె వెళ్తున్న ట్యాంకర్‌ టైర్‌ పేలిపోయింది. ట్యాంకు అదుపుతప్పి షడన్‌గా కారు ముందు వైసుకు వచ్చింది. కారు డ్రైవర్‌ అదుపు చేయలేక ట్యాంకర్‌ను ఢకొీన్నాడు. దీంతో కారులో ప్రయాణిస్తున్న శివశంకర్‌, రామకష్ణ అక్కడిక్కడే మతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకట్రావును హైవే అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు కొద్దీ సేపట్లో మార్టూరు చేరుకొనే లోపే రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు వ్యక్తులు మతి చెండంతో ఆయా గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బాపట్ల జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.